గుర్రపు డెక్కను తొలగించే.. సోలార్ యంత్రం

గుర్రపు డెక్కను తొలగించే.. సోలార్ యంత్రం

ఏ చెరువు చూసినా గుర్రపు డెక్క సమస్య కామన్.. మొత్తం చెరువును గుర్రపు డెక్క మింగేసే దృశ్యాలు సర్వసాధారణం.. ఈ సమస్యను గమనించిన బీటెక్ విద్యార్థికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఫలితంగా ఒక ఆవిష్కరణ జరిగింది. అదే చెరువులోని గుర్రపు డెక్కను తొలగించే రివర్స్ క్లీనింగ్ యంత్రం. విద్యార్థి అభివృద్ధిచేసిన ఈ యంత్రంతో ప్రయోగాత్మకంగా  మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సందా చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను ఇవాళ తొలగించారు. ఈసందర్భంగా యంత్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.  

ఈ మిషన్ సోలార్ తో పనిచేయడంతో పాటు డీజిల్ లేకుండా పనిచేస్తుందని మంత్రి సబిత తెలిపారు. ఫలితంగా ఎలాంటి గాలి కాలుష్యం కూడా జరగదని చెప్పారు. చెరువుల్లో ఉన్న వ్యర్థాలను తొలగించడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు.