మంచినీటి నల్లా కనెక్షన్స్ ప్రారంభించిన మంత్రి సబిత

మంచినీటి నల్లా కనెక్షన్స్ ప్రారంభించిన మంత్రి సబిత

రంగారెడ్డి :  దేశంలోని ఏ రాష్ట్రం చేపట్టని విధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గ్రామాల్లో ఇప్పటికే 100 శాతం మిషన్ మిషన్ భగీరథ పనులు  పూర్తయ్యాయని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి  కార్యక్రమాల్లో మంత్రి సబిత పాల్గొన్నారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను మేయర్ పారిజాత నరసింహ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న శివారు ప్రాంతాల్లోని మునిసిపాలిటీలలో నూతన పైప్ లైన్లు, రిజర్వాయర్ల వంటి నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గానికి రూ.210 కోట్లు మంజూరు చేశారని, బడంగ్ పేట్ కార్పొరేషన్ కు రూ.60 కోట్ల నిధులు విడుదల అయ్యాయని అన్నారు. 

ఒక్కరోజే 8 కాలనీల్లో 4 కోట్ల 69 లక్షలతో చేపట్టిన వాటర్ వర్క్స్  పనులు  పూర్తి చేసుకొని.. ఇంటింటికి నీరు ఇవ్వటం సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వాటర్ బోర్డు అధికారులు మిగిలిన అన్నీ కాలనీలకు కూడా నీరు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కమిషనర్ పాల్గొన్నారు.