‘మన ఊరు–మన బడి’ తో పాఠశాలల రూపురేఖలు మారుతున్నయ్: మంత్రి సబిత

‘మన ఊరు–మన బడి’ తో పాఠశాలల రూపురేఖలు మారుతున్నయ్: మంత్రి సబిత

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బోడుప్పల్ లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఎంసీ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో నూతనంగా  నిర్మించిన అదనపు గదులు, ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్, డిజిట్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డితో కలిసి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎఫ్ఎంసీ సంస్థ ముందుకు వచ్చి పాఠశాలలో రూ.80 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రామాన్ని ప్రారంభించిందని, అందుకోసం రూ.7300 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని,  గురుకులాల్లో ఇప్పటి వరకు 1150 జూనియర్ కాలేజీలు, 80 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించామని మంత్రి సబిత తెలిపారు.