గాజుల రామారంలో బాలుర జువైనల్ హోమ్ లో పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన

గాజుల రామారంలో బాలుర జువైనల్ హోమ్ లో పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన

తెలిసి, తెలియని వయస్సులో చేసిన తప్పులకు శిక్షలు అనుభవిస్తూ, జువైనల్ హోమ్స్ లలో కాలం గడుప్తున్న పిల్లల జీవితాలకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం బాచుపల్లి మెయిన్ రోడ్ లో ఉన్న బాలుర జువైనల్ హోమ్ లో కొత్తగా పెట్రోల్ బంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా జువైనల్ హోమ్ లో శిక్ష అనుభవిస్తున్న పిల్లలకు ప్రభుత్వం తరుపున నెలకు రూ.16 వేలు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ఎమ్మెల్సీ సురభివాణి, ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. 

మరోవైపు బీజేపీపై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జాతీయ దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయని, రెండు రోజుల ముందు బీజేపీ నాయకులు చెప్పేది రాష్ర్టంలో జరుగుతోందని ఆరోపించారు.