జిల్లాల్లో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దు

జిల్లాల్లో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దు

కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజల ఆశీర్వదంతో దేశంలో  అతిపెద్ద ప్రాంతీయ పార్టీ గా టీఆర్ఎస్ అవతరించిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతామంటే బీజేపీ ఉలిక్కిపడిందన్నారు మంత్రి. విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేదన్నారు. గిరిజన రిజర్వేషన్లు కేంద్ర బీజేపీ ప్రభుత్వం  పక్కన పెట్టిందన్నారు. వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వ హామీలు అన్ని నెరవేర్చుతామన్నారు. పార్టీ లో నాయకులందరూ ఒక తాటి పై నిలబడి పార్టీని ఇంకా పటిష్టం చేయాలన్నారు మంత్రి. జిల్లాలో వేరే రాజకీయ పార్టీలకు తావు ఇవ్వొద్దన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి. 

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో కొత్త కేసులు 1,217

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర