ఏజెన్సీలో రెండు పంటలకూ సాగునీరు : మంత్రి సీతక్క

ఏజెన్సీలో రెండు పంటలకూ సాగునీరు : మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు: ఏజెన్సీలో రెండు పంటలకూ సాగు నీరందించేందుకు ప్రభుత్వం రూ.140 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి, కొత్తగూడలోని రైతు వేదికలో అన్ని శాఖల జిల్లా, మండల ఆఫీసర్లతో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం పరిష్కరించేందుకే ప్రజా దర్బార్​ రాష్ర్టంలోనే ప్రథమంగా ములుగు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ప్రతి వినతి పత్రాన్ని మంత్రి స్వీకరించి సమస్య పరిష్కరించేందుకు ఆఫీసర్లను ఆదేశించారు. గుంజేడులో బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు కల్యాణ్ తల్లి ఇటీవల మృతిచెందగా, ఆయనను పరామర్శించారు. గంగారం మండలం మడగూడలో చుంచ సారయ్య ఇంట్లో జరిగిన వేడుకలో పాల్గొన్నారు. మంత్రివెంట కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎస్పీ శబరీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్​ రేగ కల్యాణి, డీఆర్డీవో పీడీ మధుసూదన్​రాజు తదితరులు పాల్గొన్నారు.