రాయ్ బరేలిలో మంత్రి సీతక్క ప్రచారం

రాయ్ బరేలిలో మంత్రి సీతక్క ప్రచారం

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని రాయ్ బరేలి ఓటర్లను మంత్రి సీతక్క కోరారు. బుధవారం ఆమె ఉత్తరప్రదేశ్‌‌ రాయ్ బరేలిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, రాహుల్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. 5వ విడతలో  భాగంగా ఈ నెల 20న రాయ్ బరేలిలో ఎన్నికలు జరగనున్నాయి. 10 ఏండ్ల మోదీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, ఇండియా  కూటమే అధికారంలోకి రానుందని సీతక్క పేర్కొన్నారు.