నీ స్థాయి ఏంటో తెలిసే కింద కూర్చోబెట్టారు..రేవంత్ను సీఎంను చేశారు: సీతక్క

నీ స్థాయి ఏంటో  తెలిసే కింద కూర్చోబెట్టారు..రేవంత్ను  సీఎంను చేశారు: సీతక్క

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు మంత్రి సీతక్క.  కేటీఆర్ స్థాయిని ప్రజలు గుర్తించే తనను కింద కూర్చోబెట్టి..రేవంత్ రెడ్డిని సీఎంను చేశారని చెప్పారు.  కేటీఆర్ రాజీనామా చేయమంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.

 అవసరమైతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళి పోవాలన్నారు.  కేటీఆర్,హరీశ్, లు దిగుజారుడు రాజకీయలు మానుకోవాలని సూచించారు. మీ అయ్య  కేసీఆర్..అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఇంట్లో కూర్చున్నాడు.. తెలంగాణ ప్రజలు  మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. మీరు చేసిన అప్పులకు జనం ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

ఏజెన్సీలో పోడు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలన్నారు సీతక్క .  ఏజెన్సీ లో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో అభివృధ్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు.  

ALSO READ :- Health Alert: 100 కోట్ల మందికి పైగా ఆ సమస్య ఉంది...!

రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ప్రధాన మంత్రికి దగ్గరకి వెళ్లి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించాలన్నారు.   ఇచ్చిన మూడు పథకాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు కండ్లు తిరిగిపోతున్నాయని చెప్పారు.  ఏం  మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల దిగజారుడు  మాటలు చూసి తెలంగాణ ప్రజలు  ఛీ కొడుతున్నారని విమర్శించారు.