మహిళలకు మహాలక్ష్మీ పథకం వరం : మంత్రి సీతక్క

మహిళలకు మహాలక్ష్మీ పథకం వరం : మంత్రి సీతక్క

ములుగు/ తాడ్వాయి, వెలుగు : మహాలక్ష్మి పథకం కింద కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం సంతోషకరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగులో మహాలక్ష్మీ సంబురాల్లో భాగంగా మంత్రి జంగాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అంతకుముందు బస్టాండ్ లో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, రీజినల్ మేనేజర్ డి.విజయ భాను, డీఎం ఎం.రవిచంద్ర సంబురాల్లో పాల్గొని ఆర్టీసీ ఆఫీసర్లను సన్మానించారు. 

ములుగులో నూతన ఆధునిక బస్టాండ్​ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.  తాడ్వాయి మండలం కొండపర్తికి చెందిన మేడారం ట్రస్ట్​ బోర్డు చైర్మన్​ అరేం లచ్​పటేల్​తల్లి ఎల్లమ్మ (65) అనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి సీతక్క గ్రామానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎల్లమ్మ పార్ధీవ దేహానికి నివాళులర్పించారు.