మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
  • మంత్రి సీతక్క  

అమ్రాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని మహిళలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.  ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి అమ్రాబాద్  మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కల్ములోని పల్లి, జంగం రెడ్డిపల్లి, మాధవానిపల్లి, మొల్కమామిడి, తుర్కపల్లి గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

 మహిళా సంఘాలలో పనిచేస్తున్న మహిళలు మరణిస్తే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తీసుకున్న రుణం రూ. 2 లక్షలు మాఫీ  చేస్తామన్నారు.  పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.  అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు మండల నాయకులు హరి నారాయణ గౌడ్, బాలింగం గౌడ్ పాల్గొన్నారు.