
- త్వరలో ప్రధానిని సీఎం కలుస్తరు : మంత్రి సీతక్క
కామారెడ్డి, వెలుగు: కొంత మందికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావొద్దని ఉందని మంత్రి సీతక్క తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, ఈ అంశంలో సీఎం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తారని చెప్పారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో వివిధ పథకాల అమలుపై రివ్యూ చేశారు. ఇందిర మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కె.మదన్ మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతరావు, ఎంపీ సురేశ్ షెట్కార్, మహిళ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై తీసుకొచ్చిన అర్డినెన్స్‌కు గవర్నర్ అమోదం పొందాల్సి ఉందన్నారు. కొందరు బీసీ కుల గణనలో కూడా పాల్గొనలేదని విమర్శించారు. కామారెడ్డి వేదికగా బీసీలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ టీచర్, ఆయా ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.