కాంగ్రెస్​తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క

కాంగ్రెస్​తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క

లక్ష్మణచాంద, వెలుగు: కాంగ్రెస్​పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క అన్నారు. లక్ష్మణచాంద మండలం వడ్యాల్, రాచాపూర్, బాబాపూర్ గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ కూలీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశానికి అందించడమే లక్ష్యంగా హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.

ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తే కూలీలకు రోజుకు రూ.400 చెల్లించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తనకు ఓటేసి గెలిపిస్తే కూలీల సమస్యల పరిష్కరించేందుకు ఢిల్లీలో మాట్లాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు,  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఒడ్నాల రాజేశ్వర్, నాయకులు నరేశ్ రెడ్డి, ఈటల శ్రీనివాస్, జడ్పీటీసీ ఒస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కుంటాల: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు సూచించారు. కుంటాల మండలంలోని ఆర్లి ఎక్స్ రోడ్డు వద్ద పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కలసి కట్టుగా పనిచేస్తూ సుగుణక్క గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. జడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, మాజీ ఎంపీపీ బోజరాం పటేల్, నాయకులు కొత్తపల్లి బుచ్చన్న, రమణ గౌడ్, వెంకటేశ్, సునీల్ రెడ్డి తదితరులు ఉన్నారు.