మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​  పట్టణంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను  మంత్రి  సీతక్క గురువారం  ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్​ లో   అంగన్ వాడీ టీచర్లకు 1368 నూతన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వయో వృద్ధుల కోసం డే కేర్​ సెంటర్లు ద్వారా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  ఉంటాయని,  అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల ద్వారా  మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.  వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు ప్రేమగా చూసుకోవాలని, వారిని  ఒంటరిగా వదిలేయొద్దని సూచించారు.    కార్యక్రమంలో   ఎమ్మెల్యేలు  భూక్య మురళి నాయక్,   కోరం కనకయ్య,  కలెక్టర్ స్నేహ శబరిష్,  మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి  పాల్గొన్నారు.