ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్‌‌‌‌ చేయాలి : మంత్రి సీతక్క

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్‌‌‌‌ చేయాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్‌‌‌‌ చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రాఘవపట్నంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను గురువారం కలెక్టర్‌‌‌‌ దివాకర టీఎస్, డీఎఫ్‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్‌‌‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ రవిచందర్‌‌‌‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్లు నిర్మించుకుంటున్న పొన్నం రవీందర్, లింగయ్య, కృష్ణవేణి, కోరం రాంమోహన్‌‌‌‌తో మాట్లాడారు. 

ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండో విడత లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌ సిద్ధం చేయాలని, పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. మరో నాలుగేండ్లలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణ పురోగతి వివరాలు ఇందిరమ్మ ఇండ్ల యాప్‌‌‌‌లో ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్‌‌‌‌ అవుతాయన్నారు.
 
టెన్త్‌‌‌‌ స్టూడెంట్లకు సన్మానం

టెన్త్‌‌‌‌లో ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్లను గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మంత్రి సీతక్క కలెక్టర్‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లా రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలవడం అభినందనీయం అన్నారు. వచ్చే సంవత్సరం ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిపేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోత్‌‌‌‌ రవిచందర్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.