- రూరల్ విమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్లో మంత్రి సీతక్క
మాదాపూర్, వెలుగు : మహిళలు అన్ని రంగాల్లో, ఆర్థికంగా రాణించేలా తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ‘డెమోక్రటిక్ సంఘ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రూరల్విమెన్స్లీడర్షిప్’ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు వ్యాపారాల్లో రాణించేలా ప్రోత్సహకాలు అందజేస్తామన్నారు.
మహిళలపై లైంగిక వేధింపులు పెరగడం బాధాకరమన్నారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్యతోపాటు మరికొన్ని ఘటనలను ప్రస్తావించారు. తన శాఖ తరఫున మహిళలకు అండగా ఉంటానని చెప్పారు. పురుషులు మహిళలపై వివక్ష చూపకుండా వారి ఆర్థిక, సామాజిక ప్రగతి, అభ్యున్నతికి పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా.గీతారెడ్డి, హీరోయిన్రెజీనా, డెమోక్రటిక్సంఘ్ప్రతినిధులు పాల్గొన్నారు.
