హైదరాబాద్, వెలుగు: కోల్డ్ చెయిన్ పరిశ్రమ వృద్ధి, అవకాశాలు, పెట్టుబడులపై చర్చించడానికి ‘కోల్డ్చెయిన్ అన్బ్రోకెన్2024’ పేరుతో హైదరాబాద్లో గురువారం సదస్సు జరిగింది. ఇరవైకి పైగా దేశాల నుంచి 350 మందికిపైగా పరిశ్రమ నిపుణులు, విధానకర్తలు, వాటాదారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్డ్చెయిన్కు సంబంధించిన కొత్త టెక్నాలజీలను ప్రదర్శించారని సీసీయూబీ చైర్మన్ సతీష్లక్కరాజు చెప్పారు.
మన రాష్ట్రంలో కోల్డ్చెయిన్స్టోరేజీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వచ్చిన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మాట్లాడుతూ, లాజిస్టిక్స్లో పర్యావరణ అనుకూల పరిష్కారాలను కనుగొనడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.