వంశీకృష్ణ విజన్ ఉన్న లీడర్..పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా వస్తున్నాడు : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు

వంశీకృష్ణ విజన్ ఉన్న లీడర్..పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా వస్తున్నాడు : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు
  •     ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు
  •     చిన్న వయసులోనే పారిశ్రామిక వేత్తగా సక్సెస్ అయ్యారన్న మంత్రి

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజన్ ఉన్న నాయకుడని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాడని, వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు

ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనందరి ఆత్మీయుడు కాకా వెంకటస్వామి మనుమడు, డాక్టర్‌‌‌‌‌‌‌‌ వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీని ఆదరించి ఎంపీగా గెలిపించాలని కోరారు. తన తండ్రి శ్రీపాద రావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిశ్రమల స్థాపన చేసి

ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వంశీ ప్రజల ముందుకొచ్చారన్నారు. చిన్న వయసులోనే పారిశ్రామిక వేత్తగా సక్సెస్ అయ్యారని కొనియాడారు. బైక్ ఇండస్ట్రీ పెట్టి యువతకు ఉపాధి కల్పించారన్నారు. ఈ సందర్బంగా వంశీకృష్ణ రూపొందించిన ఆటమ్ బైకును మంత్రి శ్రీధర్ బాబుకు బహూకరించారు.

మంథని అభివృద్ధిలో శ్రీపాదరావు కీలకం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఒక్కప్పుడు బ్యాక్ వార్డు ఏరియాగా ఉన్న మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో శ్రీపాదరావు కీలక పాత్ర వహించారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో గూండా రాజకీయాలు నడిచాయన్నారు. హత్యలు, అక్రమ దందాలు పెరిగాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తన కొడుకును మీ బిడ్డలా ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని కోరారు. 

వంశీని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటడు : ఎమ్మెల్యేలు 

వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని పార్లమెంట్‌‌‌‌ నియోజవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌‌‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌​కుమార్, ​మక్కాన్​సింగ్ రాజ్ ఠాకూర్,  ప్రేమసాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా వినోద్‌‌‌‌ మాట్లాడుతూ..  పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాల్లేకుండా పోయాయని మండిపడ్డారు. యువకుడు వంశీకృష్ణను పెద్దపల్లి లోక్ సభ ఎంపీగా గెలిపించాలని కోరారు. అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌​కుమార్ ​మాట్లాడుతూ.. గడిచిన పదేండ్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చారని, అలాగే లోక్ సభ ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మక్కాన్​సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కూడా ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీకి మరోసారి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. వంశీకృష్ణ తాత కాకా వెంకట స్వామి, తండ్రి, పెద్దనాన్నలు వివేక్, వినోద్‌‌‌‌ల నుంచి సేవాభావాన్ని అలవర్చుకున్నారని చెప్పారు. 

మీ ఇంట్లో చిన్న కొడుకులా ఆదరించండి.. 

మీ ఇంట్లో చిన్న కొడుకు లాగా నన్ను ఆదరించి, పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో గెలిపిస్తే జీవితాంతం రుణపడి ఉంటాను. చిన్న వయసులోనే తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోయిన శ్రీపాదరావుకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. తండ్రిని మించిన తనయుడుగా శ్రీధర్ బాబు నడుచుకుంటున్నారు.

శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధిని చూసి నేను స్ఫూర్తి పొందాను. నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లి ప్రాంతానికి ఉద్యోగాలు తీసుకొస్తాను.  కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన రాష్ట్రం, దేశం బాగుపడుతుంది.     

గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి