కోల్ బెల్ట్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నేతకాని సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేతకాని కులం వారు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేతకాని సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇస్తున్నామన్నారు. ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నేతకాని సంఘం రాష్ట్ర నేత దుర్గం నరేశ్తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ కోసం విన్నవించారు.