పీఆర్ఎల్ఐ ​జాతీయ హోదా ఏమైంది? : శ్రీనివాస్ గౌడ్

పీఆర్ఎల్ఐ ​జాతీయ హోదా ఏమైంది? : శ్రీనివాస్ గౌడ్

హన్వాడ, వెలుగు: గతంలో మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చి ఈ గడ్డపై కాలు పెట్టాలని మంత్రి  శ్రీనివాస్ గౌడ్  డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలో రూ.28 కోట్లతో చేపట్టిన చెక్ డ్యామ్​లు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, జీపీ బిల్డింగ్​లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మునిమోక్షం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ఎగువన ఉన్న అప్పర్  భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, పాలమూరుకు అన్యాయం చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న కృష్ణా జలాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలన్నారు.ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల రమణారెడ్డి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తహసీల్దార్  కిష్టానాయక్  పాల్గొన్నారు.