75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో కాల్పుల కలకలం

75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో కాల్పుల కలకలం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పట్టుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతుండగా అక్కడే ఉన్న జిల్లా ఎస్పీ గన్ పైకి పెట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి సూచించారు. దీంతో మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకుముందు వేడుకల్లో భాగంగా అచ్చంపేట పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ  కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీఎస్పీ కృష్ణ కిషోర్, ఆర్డీవో,  ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీసులు, విద్యార్థులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇండియాకు స్వాతంత్రం తీసుకొచ్చిన అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు ప్రజాప్రతినిధులు వివరించారు. స్వాతంత్ర సమరయోధుల ఉద్యమాలను సినిమా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పారు.