కులాలు, మతాల పేరుతో  ప్రజల మధ్య చిచ్చు

కులాలు, మతాల పేరుతో  ప్రజల మధ్య చిచ్చు

మహబూబ్ నగర్:  కుల, మతాల పేరుతో కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. వానకాలం సాగు సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ... రైతు ఉన్నంత కాలం రైతు బంధు  పథకం ఉంటుందని, ఏ పంట వేస్తే లాభమొస్తే అదే పంట వేయాలో రైతులు ఆలోచించాలని కోరారు. 24 గంటల కరెంటు తెలంగాణ తప్ప ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో రైతులు ఆలోచించాలని, యాసంగి వడ్లు తమే కొంటామని చెప్పిన కేంద్ర మంత్రి మాట తప్పారని తెలిపారు. ఇపుడు పాలమూరు జిల్లాను లేబర్ జిల్లా అని ఎవరైనా అంటరా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావొస్తోందని,  దాంతో పాలమూరు సస్యశ్యామలం కానుందని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ , బీజేపీ కుట్ర పన్నుతున్నాయని, అలాంటి పార్టీలను భూస్థాపితం చెయ్యాలని పిలుపునిచ్చారు.