దళితులను వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యం..

దళితులను వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యం..

ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తూ.. వారి కుటుంబాల్లో వెలుగు నింపుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు మంజూరైన 27 వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నిరాదరణకు గురైన దళితులను వృద్ధిలో తీసుకురావడమే లక్ష్యంగా దళిత బంధు అమలు చేస్తున్నమని తెలిపారు. దేశంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరగలేదని అన్నారు.దళితుల్లో వివక్ష రూపుమాపి ఆర్థిక స్వావలంబన కోసమే ఈ దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకోచ్చారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేసుకోవాలన్నారు మందత్రి సూచించారు. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ కార్పొరేటర్ లతో సమావేశమయిన ఈ విషయాన్ని మంత్రి తలసాని ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ కు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తే బాగుండేదని అన్నారు. కార్పొరేటర్ లతో సమావేశం ఏర్పాటు చేసి వారిని ఒట్టి చేతులతో పంపడం హాస్యాస్పదమని మంత్రి తలసాని ఎద్దేవ చేశారు.