ఈటల హుజురాబాద్ లో బీసీ.. శామీర్ పేటలో ఓసీ

ఈటల  హుజురాబాద్ లో బీసీ.. శామీర్ పేటలో ఓసీ

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను.. ఈటల రాజేందర్ బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మాటలు ఈటల అహాఁకారానికి నిదర్శనమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు. ఆనాడు ఈటల కూడా దామోదర్ రెడ్డి ముందు చిన్నవాడే. ఈటల రాజేందర్ హుజురాబాద్ లో బీసీ.. శామీర్ పేటలో ఓసీ. హుజురాబాద్ ప్రజలు పీతలకు గుణపాఠం చెబుతారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రాధాన్యతనిస్తుంది. గతంలో సుమన్, కిషోర్ లాంటి వాళ్లకు పార్టీ అవకాశం కల్పించింది. గెల్లు శ్రీనివాస్ కు కూడా అదేవిధంగా కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారు. జానారెడ్డికి  పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుంది. గతంలో ఈటల ఆరుసార్లు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపైన విజయం సాధించారు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు’ అని మంత్రి అన్నారు.