గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు

గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు

హైదరాబాద్: దేశంలో గిరిజనుల సంక్షేమాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బంజారాహిల్స్ లో సేవాలాల్ భవన్, కొమురంభీం ఆదివాసీ భవన్ లను మంత్రులు సత్యవతి రాతోడ్, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని తెలిపారు. బంజారాలకు అతిపెద్దభవనాన్ని నిర్మించామని, ఈనెల 17న  సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవనం ప్రారంభిస్తామన్నారు. త్వరలో పోడుభూముల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా.. కేంద్రం పట్టించుకోలేదన్నారు.

గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం కేటాయించామని, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీని తీసుకురావడానికి చేతకాని బీజేపీ నాయకులు.. తమను బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గిరిజన బిడ్డగా సేవాలాల్ భవనాన్ని చూసి గర్విస్తున్నానని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. త్వరలో 10 లక్షల ఎకరాల్లో పోడు పట్టాలు ఇవ్వబోతున్నామని ఆమె స్పష్టం చేశారు.