ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో లైంగికదాడియత్న, హత్యాయత్నానికి గురై తీవ్రంగా గాయపడిన మైనర్ బాలికను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.బాలిక పరిస్థితిని చూసి మంత్రి తుమ్మల చలించిపోయారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్‌తో మాట్లాడి బాలికకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడిన మంత్రి, బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు అవసరమైన సహాయం, సంరక్షణ అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
