
- హుజూర్నగర్లో భూములు అనువుగా ఉంటాయన్న మంత్రి ఉత్తమ్
హుజూర్ నగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య ఆదివారం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం గుండ్ల పహాడ్, హుజూర్ నగర్ మగ్దుమ్ నగర్ లోని భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ పరిధిలోని సర్వే నంబర్ 1041 భూములు అగ్రి కల్చర్ కాలేజీ ఏర్పాటుకు అనువుగా ఉంటాయని తెలిపారు.
ఇక్కడి భూములకు రోడ్డు కనెక్టివిటీ, సాగు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయని, సాగర్ ఎడమ కాలవ ద్వారా నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీ డీన్ ఝాన్సీ రాణి, డీఎస్ఏ వేణుగోపాల్ రెడ్డి, లింగయ్య, ఎస్పీ కె నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, డీఏవో శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్లు కమలాకర్, నాగార్జున రెడ్డి, ఏవో కల్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.