రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

వెలుగు, నెట్​వర్క్​:మాజీ ప్రధాని దివంగత రాజీవ్​గాంధీ సేవలు మరువలేనివని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశంలో ఆర్థిక స్థిరత్వానికి పునాదులు పడ్డాయన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటుహక్కు కల్పించిన మహనీయుడని కొనియాడారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. 

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.  చిట్యాల మున్సిపాలిటీలో, చండూరులో, పాలకవీడులో కాంగ్రెస్​నాయకులు రాజీవ్​గాంధీ వర్ధంతి జరిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో నాయకులు నివాళి అర్పించారు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ శంకర్​నాయక్​నివాళి అర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్మా జీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.