- ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు: ప్రభుత్వం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో ఆయా ఎత్తిపోతల పథకాల పురోగతి, హుజుర్ నగర్‌లోని నీటిపారుదల శాఖా కార్యాలయ నిర్మాణ పనులు, కోదాడ నియోజకవర్గ పరిధిలోని రెడ్లకుంట, రాజీవ్ శాంతినగర్, ఆర్-9, మోతే ఎత్తిపోతల పథకాలు, కోదాడలో నీటిపారుదల శాఖా కార్యాలయ భవన నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్, పదిమంది సభ్యులతో కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కోదాడ పద్మావతి రెడ్డి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఈఎన్‌సీలు, అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేశ్ బాబు లతో పాటు హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు,నీటిపారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.
