ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : నియోజకవర్గంలో ఆదర్శవంతంగా అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రూ.3 కోట్ల 60 లక్షలతో అవుట్ పేషెంట్ బ్లాక్, పార్కింగ్ షెడ్లు, దోబీ ఘాట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 

రూ.కోటీ25 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్, బ్లడ్ సెంటర్లు, రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం రూ.7 కోట్ల 99 లక్షలతో ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

 కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఎంహెచ్ వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్  వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్ వో జయమనోహరి, ఆస్పత్రి సూపరింటెండెంట్​ప్రవీణ్, గైనకాలజిస్ట్ వనజ, ఇరిగేషన్ ఎస్ఈ నాగభూషణ్ రావు, ఈఈ రామకిశోర్, సత్యనారాయణ, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, విద్యుత్ ఎస్ఈ ప్రాంక్లిన్, డీఈ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు.