V6 News

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి వాకిటి శ్రీహరి 

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి వాకిటి శ్రీహరి 

చిన్నచింతకుంట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి,  దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 75 ఏండ్ల వసంతోత్సవాల వేడుకలో వారు మాట్లాడారు.

గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ కేకే రెడ్డి సేవలను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల చైర్‌‌‌‌ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కథలప్ప తదితరులు పాల్గొన్నారు.