అంగన్వాడీ టీచర్ల సమస్యలు.. క్యాబినెట్‌‌‌‌ మీటింగ్లో చర్చిస్తా : మంత్రి వాకిటి శ్రీహరి

అంగన్వాడీ టీచర్ల సమస్యలు.. క్యాబినెట్‌‌‌‌ మీటింగ్లో చర్చిస్తా : మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: అంగన్​వాడీ టీచర్ల సమస్యలను క్యాబినెట్​ మీటింగ్​లో చర్చిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం మక్తల్‌‌‌‌లో అంగన్​వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులు మంత్రి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం కోసం మంత్రుల ఇళ్లను ముట్టడించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. సమస్యల పరిష్కారం కోసం కూర్చొని చర్చిద్దామని సూచించారు. 

అంగన్​వాడీ టీచర్ల సమస్యలను త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఆంజనేయులు, గోవింద్ రాజ్, రమేశ్​ పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. 

మక్తల్​ నియోజకవర్గంలో విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని డీటీఎఫ్​ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరికి  వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సంఘం​జిల్లా అధ్యక్షురాలు హైమావతి, ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర మాట్లాడుతూ మక్తల్​ మండలంలోని మంతన్ గోడ్  జడ్పీ హైస్కూల్​లో ఇప్పటికీ పోస్ట్​ శాంక్షన్  కాలేదన్నారు. ఈ స్కూల్​కు కాట్రేవుపల్లి, గోలపల్లి, టేకులపల్లి గ్రామాల నుంచి 200 మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. పీడీ పోస్టు లేకపోవడంతో విద్యార్థులు ఆటల్లో వెనకబడి పోతున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి జూపల్లి ఆఫీస్​ ముట్టడి..

కొల్లాపూర్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్​వాడీ టీచర్స్  వెల్ఫేర్  యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీస్​ను ముట్టడించారు. అనంతరం మంత్రి ఓఎస్డీ కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన అంగన్​వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులు పర్వతాలు, శివవర్మ, రామయ్య, రాము, నీరజ, హుస్సేన్,  చిన్నమ్మ, లక్ష్మి, జ్యోతి, గోవిందమ్మ, సుశీల, భాగ్యమ్మ, జయమ్మ పాల్గొన్నారు.