
మక్తల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తొందరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్క్యాంప్కార్యాలయంలో 5 గ్రామాల్లో 78 మంది లబ్ధిదారులకు ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలో19 మంది, కాట్రేవ్ పల్లిలో 26, ఖానాపూర్‌లో 12 మంది, రుద్రసముద్రం11 మంది, పారేవులలో10 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరగా ఇండ్లు కట్టుకోవాలన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి శ్రీహరి నల్ల జానమ్మ దేవాలయం నుంచి ప్రభుత్వ కళాశాల మైదానం వరకు 2కే రన్ లో పాల్గొన్నారు. నందినినగర్, ఎల్బీ కాలనీ, ఆనంపల్లి వీధి, శ్రీరాంనగర్, ఆజాద్ నగర్ కాలనీ వాసులు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.
టీయూడబ్లుజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లాలోని జర్నలిస్ట్ కుటుంబాలకు నిర్వహించనున్న ఉచిత హెల్త్ క్యాంప్ వాల్ పోస్టర్ ను మంత్రి విడుదల చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, హెల్త్ కన్వీనర్ సంజీవ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30 శనివారం ఉదయం10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నారాయణ పేట పట్టణంలోని ఎస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.