కేంద్ర మంత్రిపై మంత్రి వేముల ఫైర్

కేంద్ర మంత్రిపై మంత్రి వేముల ఫైర్

నిజామాబాద్, వెలుగు: మోడీ ఫొటో పెట్టాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలదీయడానికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటిస్తున్నారా..? అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రాద్దాంతాలు చేసేందుకు బీజేపీ లీడర్లు ఇక్కడకు వస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ఎమ్మెల్యేలు గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తా, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రుల పర్యటనలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  దూషించడం తప్ప వారు చేసేదేమీ లేదన్నారు. మోడీ వైఫల్యాలు, కేంద్ర విధానాలపై కేసీఆర్ పోరాడుతున్నారని అందుకే బీజేపీ లీడర్లు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అధికంగా పన్నులు చెల్లిస్తోందని, ఆ డబ్బుతో మిగితా రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. మరి ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటో పెడతారా? అని ప్రశ్నించారు. నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. ఆమె ఇక్కడ ఫొటోల పంచాయతీ ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. జిల్లాలో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదన్నారు. తాను ఆర్ అండ్ బి మంత్రిగా ఉండడం వల్లే మాధవ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు లభించి పనులు మొదలైనట్లు చెప్పారు.  రూ.93 కోట్లతో చేపడుతున్న ఈ ఆర్వోబీకి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.30 కోట్లే అని తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడంలేదో  బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జడ్పీ చైర్మన్​డి.విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి పాల్గొన్నారు. 

టీయూ వీసీని తొలగించాలని వినతి
డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: టీయూలో అక్రమాలకు పాల్పడుతున్న వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గుప్తాని వెంటనే తొలగించాలని శుక్రవారం వర్సిటీ స్టూడెంట్లు ఆర్ఆండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ మంత్రి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీలో జరుగుతున్న అవకతవకలు, ఈసీ అనుమతి లేకుండా ఇష్టానుసారం డబ్బులు ఖర్చు చేయడంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యమాన్ని అవమానించిన ప్రొఫెసర్​ కనకయ్యను సస్పెండ్ చేయాలన్నారు.  స్టూడెంట్ లీడర్లు సంతోష్, శివ, నవీన్, సతీష్, రచన, తమీనా, మోహన్, ఉమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్ర మంత్రి కలిసిన వారిలో
 ఉన్నారు.