
గోదావరిఖని, వెలుగు: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక, ఉపాధి, మైనింగ్‌శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళవారం (సెప్టెంబర్ 03) గోదావరిఖనిలో 40వ డివిజన్ పరిధిలోని వివేకానంద యూత్, 50వ డివిజన్పరిధిలోని కళ్యాణ్నగర్యూత్, వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను మంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని చుట్టి రమ్మని చెబితే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి మీరే తన ప్రపంచమని చాటిన గణనాథుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని శాలువాలతో సత్కరించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత, మల్లేశ్, లీడర్లు పి.మల్లికార్జున్, కుమారస్వామి, కోటేశ్వర్లు, విజయ్, మధు, నర్సింగ్ దొర, మధు, నరేందర్ రెడ్డి, దీపక్, రవికుమార్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.