
- గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి,
మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం రాత్రి గోదావరిఖనిలో పర్యటించారు. స్థానిక రాంనగర్ లో మాజీ కార్పొరేటర్లు అడ్డాల రామస్వామి, గట్టయ్య తండ్రి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోగా నివాసానికి వెళ్లి పరా
మర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి వివేక్ వెంట లీడర్లు పి.మల్లికార్జున్, మండ రమేశ్, దుబాసి మల్లేశ్, రాచకొండ కోటేశ్వర్లు, గోవర్ధన్ రెడ్డి, గడ్డం మధు. దీపక్ తదితరులున్నారు.