సంగారెడ్డిలో అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు

సంగారెడ్డిలో  అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు

సంగారెడ్డి జిల్లా వెల్ముల గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి  వివేక్ వెంకటస్వామి దంపతులు. ఆగస్టు 20న ఉదయం పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.  ప్రత్యేక అర్చన చేసి  తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

 అనంతరం  తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమల  గ్రామ మాజీ సర్పంచ్  విట్టల్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి  మంత్రి   వివేక్ వెంకటస్వామి దంపతులు హాజరయ్యారు.   కొత్త  ఇంట్లో సత్యనారాయణ స్వామికథ జరుపుకున్నందున మంత్రిని ఆహ్వానించారు విట్టల్ రెడ్డి  కుటుంబ సభ్యులు.  అనంతరం కుటుంబ సభ్యులతో అల్పాహారం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం మాట్లాడిన వివేక్.. వెలిమల గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానని చెప్పారు వివేక్.