మంచిర్యాల: గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు నియోజకవర్గం వెనకబడింది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం ( జనవరి 7) నియోజకవర్గంలోని మందమర్రి నుంచి బిజోన్ మీదుగా మంచిర్యాలకు నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ మాట్లాడి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు కల్పిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో చెన్నూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీని నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకి అన్ని విధాలా అభివృద్ది చెందుతోందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత నిచ్చామన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బాగు పడతాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా 20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. మహిళలకు పెట్రోల్ బంకులు కేటాయించి వారి ఆర్థిక ఎదుగుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు.
అనంతరం మందమర్రి మండలం రామకృష్ణా పూర్ లో క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్.
