వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి

వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ
  • శ్రీవారాహి సెలెక్షన్స్​’ వస్త్రాలయం ప్రారంభం

మలక్​పేట, వెలుగు: వస్త్ర వ్యాపారంలో కస్టమర్ల అభిరుచి ముఖ్యమని, అందుకు తగ్గట్టు ముందుకు వెళ్తే మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సైదాబాద్​లోని వినయ్ నగర్ కాలనీలో ‘శ్రీవారాహి సెలెక్షన్స్’ వస్త్రాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి స్నేహితులైన బుంగ శివకుమార్ కుటుంబ సభ్యుడు రమేశ్​ కడమంచి నెలకొల్పిన ఈ వస్త్రాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శివకుమార్ కుటుంబంతో కాకా వెంకటస్వామి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.

 కాగా, మంత్రి వివేక్​ వెంకటస్వామిని  శ్రీవారాహి సెలెక్షన్స్ యజమాని రమేశ్​, కాకా వెంకటస్వామి అభిమానులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శ్రీవారాహి సెలెక్షన్స్​ ప్రొప్రైటర్​ శైలజ, ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, గడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.