
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక,ఉపాధి, మైనింగ్‌శాఖ మంత్రి జి.వివేక్‌వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. కోటపల్లి మండలం దేవులవాడలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళి అర్పించారు. కలెక్టర్కుమార్దీపక్, డీపీవో వెంకటేశ్వర్లుతో కలిసి కొల్లూరు, దేవులవాడలో హైమాస్ట్లైట్, సీసీ రోడ్డు, చెన్నూరు మండలం లంబాడీపల్లిలో పాఠశాల పహరీ పనులు ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. భీమారం ఎస్సీ కాలనీ లో అంగన్వాడీ బిల్డింగ్, జైపూర్ మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జైపూర్మండల కేంద్రంలో మొక్కలు నాటారు. మందమర్రి బి-1 క్యాంప్‌ఆఫీస్‌లో మంత్రి వివేక్‌వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, జైనూర్, కాగ జ్ నగర్, దహెగాం, తిర్యాణి, కుంటాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పనుల జాతర–2025 ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. గత 100 రోజుల్లో ఒక్క సెలవు కూడా లేకుండా నిరంతరం పని చేసిన మున్సిపల్ సిబ్బందిని సత్కరించారు.
జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి గౌడ్ పాల్గొన్నారు. జైనూర్ మండలంలోని జామ్నిలో పశువుల షెడ్డును అడిషనల్కలెక్టర్ దీపక్ తివారి, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ రావు ప్రారంభించారు. వంద రోజుల ఉపాధిహామీ పని దినాలను పూర్తి చేసిన ఇద్దరు కూలీలను సన్మానించారు. ప్యాక్స్‌చైర్మన్ కొడప హన్నుపటేల్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో మోహన్, మేజర్ గ్రామ పంచాయతీ ఈవో ఆనంద్ రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్ పాల్గొన్నారు. కాగ జ్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఉపాధిహామీ కూలీలను సత్కరించారు.
కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమురం మాంతయ్య, ఎంపీడీవో ప్రసాద్ తదితరులున్నారు. దహెగాం మండలంలోని గిరవెల్లిలో కొత్తగా నిర్మించిన పశువుల షెడ్లను ఎమ్మెల్సీ దండె విఠల్ ప్రారంభించారు. గిరవెల్లి, ఖర్జి, గెర్రె, ఒడ్డుగూడ, కల్వాడ, కొంచవెల్లి, హత్తిని, తిమ్మాపూర్ గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను, కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు.
దహెగాం కేజీబీవీని సందర్శించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. తిర్యాణిలో నిర్మించిన పౌల్ట్రీ షెడ్డును అధికారులు ప్రారంభించారు. ఎంపీడీవో మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు. కుంటాల, కల్లూర్, అందకుర్, పెంచి కల్ పాడ్ గ్రామాల్లో పశువుల షెడ్ల పనులను అధికారులు ప్రారంభించారు. పలువురు జీపీ కార్మికులను సన్మానించారు. ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో వనజ, ఎంపీవో రహీం తదితరులు పాల్గొన్నారు.