- పార్టీ అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి
- అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌కు అవమానంపై ఖర్గే ఆరా
న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంత్రి వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్‌లో ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత సోమవారం బెంగళూరు నుంచి ఢిల్లీకి ఖర్గే వచ్చారు. ఈ నేపథ్యంలో ఖర్గే ఆరోగ్యం పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఖర్గే ఆరా తీసినట్టు చెప్పారు.
‘‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగాయి.. స్పీకర్ తల్లిని దూషిస్తూ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు గురించి ఖర్గే అడిగారు. 22ఏపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం, రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను పార్టీ అధ్యక్షుడికి వివరించాను’’అని వివేక్ వెల్లడించారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని మంత్రి హైదరాబాద్ తిరిగి వచ్చారు.
