
కోల్‌బెల్ట్/ జైపూర్/ చెన్నూరు,వెలుగు: రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదివారం మందమర్రి, చెన్నూరు, క్యాతనపల్లి, జైపూర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో అజిత్గౌడ్ -ప్రజ్ఞ వివాహానికి, పులిమడుగులో బానోత్ఇందు- కిశోర్‌ల నిశ్చితార్థానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మందమర్రిలోని బి-1 క్యాంపు ఆఫీస్‌లో మంత్రికి క్యాతనపల్లి మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మహిళ లీడర్లు రాఖీలు కట్టారు.
మందమర్రి మండలంలోని వెంకటాపూర్ పంచాయతీలోని దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి గ్రామ రైతులు, వివిధ సమస్యలపై పలువురు వినతిపత్రాలు అందజేశారు. మందమర్రి బి-1 క్యాంపు ఆఫీస్‌లో పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్ ముడారపు శేఖర్ బర్త్‌డే వేడుకలను మంత్రి సమక్షంలో నిర్వహించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి
చెన్నూరు, జైపూర్ మండలాలకు చెందిన బాధిత కుటుంబాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. చెన్నూరు పట్టణానికి చెందిన రిపోర్టర్ గట్టు సత్యనారాయణ తల్లి లక్ష్మి, జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ లీడర్ సుందిళ్ల మల్లేశ్ తల్లి శంకరమ్మ, మాజీ సర్పంచి శ్యామల బంధువు రాజేశ్వరి, కాంగ్రెస్ కార్యకర్త సాయిలు అమ్మమ్మ కొమురయ్య, కిష్టాపూర్ కాంగ్రెస్ లీడర్ లంబు గణపతిరెడ్డి కోడలు వాణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కాగా బాధిత కుటుంబాలను కలిసి మంత్రి పరామర్శించారు.