రాణాపూర్ గ్రామంలో నూతన జంటను ఆశీర్వదించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

రాణాపూర్ గ్రామంలో నూతన జంటను ఆశీర్వదించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు : పాలకుర్తి మండలం రాణాపూర్​ గ్రామంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, మైనింగ్​ శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవలే వివాహమైన రాణాపూర్ గ్రామానికి చెందిన ఎంఆర్​పీఎస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి కొండ్ర శంకర్ కుమారుడు కార్తిక్ రాజ్, కావ్యశ్రీ జంటను మంత్రి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మంత్రిని శాలువాతో సత్కరించారు. 

కన్నాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్​ తొగరి తిరుపతి బర్త్​డే వేడుకల్లో మంత్రి వివేక్​ వెంకటస్వామి పాల్గొని కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో లీడర్లు సయ్యద్​ సజ్జద్, గడ్డం మధు, గౌడ సంఘం అధ్యక్షుడు ఏగోలపు రాజయ్య, పడాల రమేశ్, పోగుల శంకరయ్య, మెడగొని రాజయ్య, వీరగోన రవి, పెండ్లి మల్లయ్య, మడిపల్లి సంజీవ్, మాటూరి లక్ష్మణ్, కాదాసి  నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.