పెద్దపల్లి జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై మంత్రులకు వినతి 

పెద్దపల్లి జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై మంత్రులకు వినతి 

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని కోరగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. మంగళవారం జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగిన భూభారతి సదస్సుకు హాజరైన మంత్రులకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు.

 అర్హులైన జర్నలిస్టులందరికీ 250 గజాల ప్రభుత్వ స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. , జర్నలిస్టుల కోసం రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని, జర్నలిస్టులు మృతి చెందితే వారి కుటుంబాలకు రూ.10 లక్షల వరకు సహకారం అందించారని కోరారు. అక్రిడిటేషన్ కార్డు గల జర్నలిస్టులందరికి ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.