
- మెదక్ కలెక్టరేట్ఎదుట టీఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల నిరసన
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్ కలెక్టర్రాహుల్రాజ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీఎన్జీవోస్, జేఏసీ అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విఠల్, రాజ్ కుమార్, ప్రసాద్, రిజ్వాన్ అలీ పాల్గొన్నారు.
దళిత మంత్రులను అవమానిస్తే సహించం..
దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని వాడు, వీడని అవమానిస్తే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని గ్రామాల్లో తిరగనివ్వమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.
దుబ్బాకలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రభాకర్‌రెడ్డి అహంకారంతో మాట్లాడడం సరైంది కాదన్నారు. వివేక్, దామోదర రాజనర్సింహ నికార్సైన తెలంగాణ వాదులని, వారి కుటుంబాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. వెంకటస్వామి గౌడ్, రవి, రాజిరెడ్డి, నరేశ్, ఏసు రెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, దేవరాజు, నర్సింలు పాల్గొన్నారు.