పాలనలో తన మార్క్ చూపిస్తున్న కేంద్ర మంత్రి

V6 Velugu Posted on Jul 10, 2021

కొత్త రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన మార్క్ చూపిస్తున్నారు. బాథ్యతలు తీసుకున్న గంటలోనే ఆఫీసు టైమింగ్స్ మార్చేశారు. ఫస్ట్ షిప్ట్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సెకండ్ షిప్ట్ మద్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే సిగ్నల్ డిపార్ట్ మెంట్ విజిట్ చేశారు. ఆఫీసులో పని చేస్తున్న ఓ ఇంజినీర్ తన కాలేజీలోనే చదివాడని తెలుసుకున్న కేంద్రమంత్రి...ఇంజినీర్ ని పిలిపించుకుని మాట్లాడారు. తనకు ఓ హగ్ ఇచ్చి కాలేజ్ డేస్ లోకి వెళ్లిపోయారు. జోధ్ పూర్ లోని MBM ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేశారు అశ్విని వైష్ణవ్. 

Tagged WORK, Ashwini Vaishnaw, Ministry Railways, officials, two nine, hour shifts

Latest Videos

Subscribe Now

More News