కారేపల్లి లో ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ మీట్

కారేపల్లి లో ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ మీట్
  • కారేపల్లి లో మైనార్టీ స్కూల్స్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన డీఎంఓ

కారేపల్లి, వెలుగు: మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలల స్పోర్ట్స్ మీట్ శుక్రవారం కారేపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు జరుగనున్న జిల్లా స్థాయి గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను శుక్రవారం ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్​తో కలిసి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ ప్రారంభించారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 13 స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడా పోటీల్లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన 13 పాఠశాలల నుంచి 975 మంది విద్యార్థినులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. 

అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లో పోటీలు ఉంటాయని వాలీబాల్‌, ఖోఖో, టెన్నికాయింట్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో మైనార్టీ గురుకుల సంక్షేమ ఖమ్మం జిల్లా ఇన్​చార్జ్ అధికారి శ్రీనివాస్, రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్  అరుణ కుమారి, డీఏసీ అప్రోజ్,ఉమ్మడి ఖమ్మం జిల్లాల మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్  డి.సావిత్రి, శైలజ, సంగీత, గీత, అఖిల, సీత, బిపాషా, పరహిన, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.