మిరాయ్ సినిమా ఇంకా చూడని ప్రేక్షకులకు గుడ్ న్యూస్

మిరాయ్ సినిమా ఇంకా చూడని ప్రేక్షకులకు గుడ్ న్యూస్

తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమేని దర్శకత్వంలో పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రం చక్కని వసూళ్లతో బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంతగానో పాపులర్ అయిన ‘వైబ్ ఉంది’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాలో లేకపోవడం పట్ల ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే  ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ పాటను యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్టు మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారికంగా ప్రకటించారు.

గౌర హరి కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ పాడాడు. తేజ, రితికా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంటపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హ్యూజ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.134 కోట్లకు పైగా గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందుకెళుతోంది. ఈ పాటను యాడ్ చేయడం వల్ల కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.