V6 News

మిర్యాలగూడను పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

మిర్యాలగూడను పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : రానున్న రోజుల్లో మిర్యాలగూడను పారిశ్రామిక హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చి, రాష్ట్రంలోనే అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేస్తామని, నేషనల్ హైవేలపై ఫ్లైఓవర్ల నిర్మాణం, శంషాబాద్ వద్ద రూ. 500 కోట్లతో ట్రైన్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ, వచ్చే ఎన్నికల్లోనూ జిల్లాలోని 12 స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ, సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ అకాల మరణం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, తక్షణ సహాయం కింద రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.