మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మౌత్ టాక్‌‌తోనే సక్సెస్

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మౌత్ టాక్‌‌తోనే సక్సెస్

అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌‌లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో దర్శకులు నాగ్ అశ్విన్,  నందిని రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, మారుతి, అనుదీప్ కేవీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్‌‌కెఎన్ అతిథులుగా హాజరై టీమ్‌‌ని అభినందించారు.

 

Also Rard: నిజాంపై పోరాటంలో.. ఆర్‌‌ఎస్‌ఎస్‌ ఎక్కడుంది?రాజా

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘-మంచి సినిమాను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రిలీజ్ దగ్గర్నుంచీ ఇప్పటి వరకు ప్రతి చోటా హౌస్ ఫుల్స్ కలెక్షన్స్‌‌ వస్తున్నాయి.  వర్డ్ ఆఫ్ మౌత్‌‌తోనే ఇది సాధ్యమైంది. అనుష్క గారితో కలిసి నటించడం హ్యాపీ ఎక్స్‌‌పీరియెన్స్.  మా  మధ్య కెమిస్ట్రీ బాగుందని, మంచి లవ్ స్టోరీ చూపించారని ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది’ అన్నాడు.  దర్శకుడు పి.మహేష్,​ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్, లిరిసిస్టులు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.