మొబైల్ అలర్ట్ : మీకు ఎమర్జెన్సీ మెసేజ్ లు రావటం లేదా.. అయితే ఇలా చేయండి

 మొబైల్ అలర్ట్ : మీకు ఎమర్జెన్సీ మెసేజ్ లు రావటం లేదా.. అయితే ఇలా చేయండి

సెప్టెంబర్ నెలలో  చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. పెద్ద సౌండ్‌తో ఈ ప్లాష్ మెసేజ్ రావడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఆందోళన పడ్డారు.  ఈ మెసేజ్ ఎవరు పంపారనేది తెలియక గందరగోళానికి గురయ్యారు. అయితే ఈ మెసేజ్ తామే పంపినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 10వ తేదీన మరికొంత మందికి ఈ మెసేజ్ వచ్చింది. ఈ సారి రెండు మూడు సార్లు మెసేజ్ మోగింది. కానీ చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ మెసేజ్ ను పొందలేకపోయారు. కారణం ఇదే..

భూకంపాలు, వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు గాను భారత ప్రభుత్వ టెలికమ్యుూనికేషన్ కు చెందిన టెస్ట్ (TEST) విభాగానికి చెందిన టెస్టింగ్ మెసేజ్ అక్టోబర్ 10వ తేదీన మరోసారి మోగింది. ఈ సారి మాత్రం మూడు నాలుగు సార్లు కేంద్రం మెసేజ్ పంపింది. అయితే చాలా మంది మొబైల్ యూజర్లకు ఈ అలర్ట్ మెసేజ్ లు రాలేదు. ఇందుకు కారణం  వారి ఫోన్‌లలోని అలర్ట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్. 

ALSO READ: ALSO READ:Good Life : ఉద్యోగం, జీవితంలో ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతున్నారా.. ఎందుకు..?

 స్మార్ట్‌ఫోన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి ఇలా చేయండి..

  • మీ ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ సెట్టింగ్‌లను త్వరగా గుర్తించడానికి సెర్చ్ లో  "నోటిఫికేషన్" అని టైప్ చేయండి.
  • నోటిఫికేషన్ మెనులో "అధునాతన సెట్టింగ్‌లు"పై క్లిక్ చేయండి.
  • "వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్" అని క్లిక్ చేసి..దాన్ని  ఆన్ చేయండి

ఈ నాలుగింటిని ఫాలో అయి ఆన్ చేస్తే చాలు..కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్‌లను అందుకుంటారు.